Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళితుల భూమి అగ్రవర్ణాల కబ్జా 

దళితుల భూమి అగ్రవర్ణాల కబ్జా 

- Advertisement -

పహానిలో మారని పేరు మార్పిడి
అక్రమంగా పౌథీ… అనధికారికంగా విక్రయం
న్యాయం చేయాలని బాధితుల ఆందోళన
కలెక్టర్ కు ఫిర్యాదు
నవతెలంగాణ – మిర్యాలగూడ 

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు ఇచ్చిన వ్యవసాయ భూమిని పహానిలో పేరు మార్పిడి చేయకపోవడంతో ఆ భూమిని అగ్రవర్ణాలు తమ కుటుంబ సభ్యులకు పౌతి చేయడంతో పాటు మరొకరికి అనధికారికంగా విక్రయం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే… పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన కెక్కరి కృష్ణమ్మ కు 1988లో సర్వేనెంబర్ 143లో 1.33 గుంటల వ్యవసాయ భూమిని సాగు చేసుకునేందుకు జిల్లా షెడ్యూలు కులాల సేవా సహకార సంస్థ ద్వారా ప్రభుత్వం అందించింది. అప్పటినుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కృష్ణమ్మ ప్రస్తుతం కబ్జాలోనే ఉంది.

అంతకుముందు ఆ సర్వే నెంబర్ లో 1954 నుంచి 1988 వరకు మాలే భాస్కర్ రెడ్డి పేరు మీద 5.30 ఎకరాల వ్యవసాయ భూమి పట్టాదారుడుగా రికార్డులను నమోదు అయ్యి ఉంది. 1988- 89 లో ఆ భూమిని మాలె భాస్కర్ రెడ్డి భార్య అయిన మాలె సరోజనమ్మ, కొడుకులు మాలె గోవర్ధన్ రెడ్డి మాలె జనార్దన్ రెడ్డి లకు పౌథీ చేయగా రికార్డులో పేర్లు మార్పు చేశారు. 1988లో జిల్లా షెడ్యూలు కులాల సేవా సహకార సంస్థ 10.37 ఎకరాల వ్యవసాయ భూమిని డాక్యుమెంట్ నెంబర్ 1982/1988 ద్వారా ₹1,09,250 లకు మాలే సరోజనమ్మ వారిద్దరి కుమారుల నుంచి కొనుగోలు చేశారు. ఆ సమయంలో నగదు చెల్లించినట్లు సర్కులర్ నెంబర్ డి1/8153/ఏపీ ఎస్ వై రికార్డులో నమోదు అయి ఉన్నది. ఆ భూమిని అప్పట్లో షెడ్యూల్ కులాలకు చెందిన పేదలకు పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ చేశారు.

అందులో కెక్కిరి కృష్ణమ్మ ఒకరు. కాగా పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ లబ్ధిదారుల పేర్లను గ్రామ పహాని రికార్డుల లో నమోదు చేయకపోవడంతో పహానిలో పాత వారి పేర్లే చూపిస్తున్నది. దీనిని ఆసరా చేసుకున్న పట్టాదారులు 35 గుంటల వ్యవసాయ భూమిని సరోజినమ్మ మాలె జనార్దన్ రెడ్డికి, 38 గుంటల భూమిని మాలే భాస్కర్ రెడ్డికి పౌథీ చేశారు. మరో 38 గుంటల భూమిని తుమ్మలపల్లి సుధాకర్ రెడ్డికి డాక్యుమెంట్ నెంబర్ 1456/2024 ద్వారా విక్రయించారు.

న్యాయం చేయాలని బాధితుల ఆందోళన
తమకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1988లో ఎకరం 33 గుంటల వ్యవసాయ భూమి ఇచ్చారని ఆ భూములో సాగు చేసుకుంటూ కుటుంబాన్నీ పోషించుకుంటున్నానని బాధితురాల కెక్కరి కృష్ణమ్మ తెలిపారు. ప్రస్తుతం గ్రామ రికార్డు పహానిలో పట్టాదారుల పేర్లు కనిపిస్తున్నాయని వారు అక్రమంగా పట్టా మార్పిడి చేసుకున్నారని ఆరోపించారు. కబ్జాలో తాము ఉన్నప్పటికీ రికార్డులో పేరు మార్పిడి చేసి 0.38 గుంటలు  విక్రయించారని తెలిపారు. ఇదేమని భాస్కర్ రెడ్డిని అడిగితే రెండు లక్షలు ఇస్తేనే మీ భూమిని మీ పేరు నా పట్ల చేయిస్తానని బెదిరిసినట్టు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తాసిల్దారుకు సబ్ కలెక్టర్కు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు క్షేత్రచారులో పరిశీలన జరిపి రికార్డులు సమర్పించారని చెప్పారు. అక్రమంగా పట్టా మార్పిడి చేసి విక్రయించిన మాలే భాస్కర్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, పహాని రికార్డులో అక్రమంగా నమోదైన పేరును తొలగించి తమ పేరును నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -