సాక్రమెంటో (కాలిఫోర్నియా) : ఉత్తర అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది సిక్కులు ప్రస్తుతం తమ భద్రతపై తీవ్ర ఆందోళనతో కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా కాలిఫోర్నియాలో రెండున్నర లక్షల మంది సిక్కులు నివసిస్తున్నారు. దేశంలో నివసిస్తున్న సిక్కు జాతీయుల్లో 40 శాతం మంది ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోనే జీవనం సాగిస్తున్నారు. శతాబ్దం క్రితం వీరంతా ఇక్కడికి వచ్చి దీనినే తమ స్వస్థలంగా చేసుకున్నారు. అయితే గత రెండు సంవత్సరాల కాలంలో ఉత్తర అమెరికాలోని సిక్కులపై దాడులు, బెదిరింపులు అధికమయ్యాయి. దీనంతటికీ భారత ప్రభుత్వమే కారణమని అమెరికా, కెనడా అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ భద్రత గాలిలో దీపంలా మారిందని సిక్కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డయాస్పొరాల రక్షణ కోసం అధికారులు ఓ కొత్త బిల్లును తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. విదేశీ ప్రభుత్వాలు డయాస్పొరా సమాజాలను లక్ష్యంగా చేసుకొని వేధించకుండా అడ్డుకునేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. విదేశీ ప్రభుత్వాల కుయుక్తులను పసిగట్టి అడ్డుకోవడానికి అధికారులకు శిక్షణ ఇస్తారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేని పక్షంలో అధికారులు తమను ఎలా రక్షించగలరని డెమొక్రటిక్ సెనెటర్ అన్నా కాబల్లెరో ప్రశ్నించారు.
అయితే ఈ ముసాయిదా బిల్లుపై భారతీయ అమెరికన్ సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ సమాజం రాజకీయంగా చీలిపోయి ఉంది. ప్రభావవంతమైన అనేక అమెరికన్ సిక్కు అడ్వొకసీ గ్రూపులు బిల్లును సమర్ధించాయి. హిందువులు, హ్యూమన్ రైట్స్ అండ్ ది ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ వంటి మత విశ్వాసాలు కలిగిన ఇతర భారతీయ గ్రూపులు కూడా దీనికి మద్దతు ఇచ్చాయి. అయితే హిందూ-అమెరికన్ గ్రూపులు, యూదు గ్రూపులు బిల్లును వ్యతిరేకించాయి. ఓ సిక్కు గ్రూపు సైతం దీనిని వ్యతిరేకించింది. ఖలిస్థాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ అమెరికన్ల వంటి డయాస్పొరా వర్గాలకు ఈ బిల్లు కారణంగా ముప్పు పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండియా, హిందూ అమెరికన్లపై వివక్ష పెరుగుతుందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
కాలిఫోర్నియా బిల్లుపై కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES