- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని రైతులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ ద్వారానే యూరియా పొందాలని పోన్కల్ క్లస్టర్ ఏఈఓ త్రిసంధ్య సూచించారు. జన్నారంలోని ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. పారదర్శకమైన పంపిణీ కోసమే ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చిందన్నారు. యాప్లో బుకింగ్ చేసుకున్న తర్వాతే దుకాణాలకు రావాలని, అక్కడ డీలర్లకు బుకింగ్ ఐడీ చూపించి యూరియా తీసుకోవాలని ఆమె రైతులకు వివరించారు. యూరియా బస్తాల కోసం రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.
- Advertisement -



