Friday, October 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు వేదికలో యూరియా పంపిణీ 

రైతు వేదికలో యూరియా పంపిణీ 

- Advertisement -

రైతులకు టోకెన్ల ఆధారంగా సరఫరా..
అధికారులు పర్యవేక్షణలో పంపిణీ
నవతెలంగాణ – కాటారం

కాటారం మండలంలోని రేగులగూడెం రైతు వేదికలో యూరియ పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యవసాయ అధికారి జాడి బాపూరావు పర్యవేక్షణలో ప్రారంభమైంది. రైతులకు ఎలాంటి  ఇబ్బందులు ఉండకూడదనే రైతు వేదిక లో యూరియా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. పంటలకు అత్యవసరంగా అవసరమైన యూరియాను రైతులకు సమయానికి అందించేందుకు టోకెన్ల ఆధారంగా సరఫరా జరుగింది.వ్యవసాయ విస్తరణాధికారులు ఆస్మా, రాజన్న, పిఎసిఎస్సిబ్బంది కలిసి పంపిణీని సమన్వయం చేసి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్రమపద్ధతిలో ఎరువులు అందుకునేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన అధికారులు రైతులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. సరఫరా సజావుగా కొనసాగేందుకు తగినంత యూరియా నిల్వలు కల్పించామన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా రోజువారీగా పంపిణీ కొనసాగిస్తాం అని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఏ శ్రీపాల్,మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ,వ్యవసాయ సహకార సంఘం సీఈవో ఎడ్ల సతీష్, పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -