Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్లస్టర్ల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ

క్లస్టర్ల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ

- Advertisement -

తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని రైతులకు యూరియా కష్టాలు రాకుండా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో క్లస్టర్ల ఏర్పాటు చేసి రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నట్లుగా తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో ఇప్పటికే మల్లారం, కొయ్యుర్, పెద్దతూండ్ల, ఆన్ సాన్ పల్లి, రుద్రారం గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో క్లస్టర్లు ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. మండలంలో ఇప్పటి వరకు సొసైటీ ఆధ్వర్యంలో 560 టన్నుల యూరియా పంపిణీ చేసినట్లుగా తెలిపారు. చైర్మన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆన్ సాన్ పల్లి, నాచారం గ్రామాల్లో మాజీ సర్పంచ్ గుగులోతు జగన్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ సర్వర్ నాయక్, మంథని మార్కెట్ డైరెక్టర్ దూలం సులోచన ఆధ్వర్యంలో 220 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -