Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుతుపాకీ నీడలో యూరియా పంపిణీ

తుపాకీ నీడలో యూరియా పంపిణీ

- Advertisement -

అందని చోట రైతుల ఆందోళనలు
అర్ధరాత్రి నుంచే లైన్‌లో
మార్కెట్‌ యార్డుల్లోనే కునుకు..

నవతెలంగాణ- విలేకరులు
యూరియా కోసం రైతన్న తిప్పలు కొనసాగుతూనే ఉన్నాయి.. తెల్లవారకముందే పెద్దఎత్తున రైతులు కార్యాలయాల వద్ద లైన్‌ కట్టడం.. వచ్చిన యూరియా తక్కువగా ఉండటంతో మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. మరికొన్ని చోట్ల అందరికీ అందకపోవడంతో రైతులు ధర్నాలు చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ కొనసాగింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా 52 టన్నులు, కిష్టాపూర్‌ అగ్రోస్‌ సెంటర్‌ ద్వారా 38 టన్నుల యూరియా పంపిణీ చేసినట్టు స్థానిక వ్యవసాయ అధికారి సాయికృష్ణ తెలిపారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో యూరియా కోసం రైతుల ధర్నా నిర్వహించారు. మార్కెట్‌ కమిటీ కార్యాలయం సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం సొసైటీలో వద్ద యూరియా కోసం వచ్చిన బచ్చువారిగూడెం పంచాయతీ జెట్టివారిగూడెం రైతు సింగరాజు అనారోగ్యానికి గురై సొమ్మసిల్లి పడ్డాడు. ఆయన చెవిలో నుంచి రక్తం రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాక గ్రామంలోని ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గణపురం మండలంలో సొసైటీకి యూరియా బస్తాల లారీ వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు భారీగా తరలొచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. వరంగల్‌ జిల్లా నెక్కొండ లో ఉదయం 5 గంటలకే టోకెన్ల కోసం మహిళలు, రైతులు క్యూ కట్టారు.

అర్ధరాత్రి నుంచి లైన్‌
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో యూరియా కోసం రైతులు అర్ధరాత్రి రెండు గంటలకు లైన్‌ కట్టారు. మార్కెట్లో ఉన్న డివైడర్‌పై కునుకు తీశారు. రైతులు వ్యవసాయ పనులకు వెళ్లి.. మహిళల ను యూరియా కోసం గజ్వేల్‌కు పంపిస్తే.. అక్కడ వారి మధ్య గొడవ జరిగి చెప్పులతో కొట్టుకున్నారు. 500 మందికి టోకెన్లు ఇచ్చిన వ్యవసాయ అధికా రులు.. 250 మందికి మాత్రమే యూరియా ఉండటంతో.. ఆందోళనతో వరుస తప్పి వస్తున్న మహిళల మధ్య గొడవ ప్రారంభమైంది. మర్కుక్‌ రైతు వేదిక వద్ద టోకెన్లు, ఓటీపీల కోసం రోజంతా పడిగాపులు కాశారు.

ఒకే రోజు మూడుసార్లు రాస్తారోకో
నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో మూడుసార్లు రాస్తారోకో నిర్వహిం చారు. రెండు వందల టోకెన్లు ఇవ్వగా.. ఐదు వందల మందిపైగా రైతులు ఆగ్రో సెంటర్ల వద్ద బారులు తీరారు. ప్రధాన రహదారిపై బైటాయించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad