Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియాకు తప్పని తిప్పలు

యూరియాకు తప్పని తిప్పలు

- Advertisement -

నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో రైతులకు యూరియా సరిపడక పడరాని తిప్పలు పడుతున్నారు. బుధవారం ఉదయం సుమారు 5 గంటల నుండే ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం వద్ద రైతులు ఆధార్‌, భూమి పాస్‌బుక్‌తో నిల్చున్నారు. పీఏసీఎస్‌కు 554 యూరియా బస్తాలు వచ్చినట్లు సీఈవో మల్లిఖార్జున్‌ తెలిపారు. కాగా ఎకరాకు ఒక బస్తాగా అలాగే ఒక రైతుకు రెండు బస్తాలుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఐనప్పటికి సరిపోకపోవడంతో కొంతమంది రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. వేసిన పంట పాడైపోతుందనే ఆవేదన చెందారు. కాగా పరపతి సహాకార సంఘం ప్రాంగణమంతా రైతులతో నిండిపోయింది. యూరియా సరఫరాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమౌతున్నాయని ఇప్పటికైన ప్రభుత్వం రైతులకు సరిపడినంత యూరియా సరఫరా చేయాలని పలువురు చర్చించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -