అవస్థలుపడుతున్న రైతులు.
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రద్దు చేసి పాతవిధానంలోనే అందివ్వాలి.
ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ.
.సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.
నవతెలంగాణ- టేకుమట్ల:- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఉసురు తీసుతున్నాయని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ, సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ అన్నారు. ఈ సందర్బంగా వారు మండల కేంద్రంలో మాట్లాడుతూ ప్రభుత్వాలు యూరియా కోసం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను తీసుక వచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బుకింగ్ యాప్ పైన అవగాహన లేక, రైతులకు స్మార్ట్ ఫోన్ లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. బుకింగ్ యాప్ పైన అవగాహన ఉన్న రైతులు యూరియా బుకింగ్ కోసం చూస్తే నిల్వ ఉండటం లేదని, అవసరం లేని రైతులు పెద్ద మొత్తంలో యూరియా బస్తాలు బుకింగ్ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అన్నారు.రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రద్దు చేసి,పాతవిధానంలోనే రైతులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంల్ లిబరేషన్ మండల కార్యదర్శి అంబాల అశ్వథామ తదితరులు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో దొరకని యూరియా.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



