నవతెలంగాణ – పిట్లం
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రైతులకు సక్రమమైన పద్ధతిలో యూరియా అందించాలని మండల కేంద్రంలోని పిట్లం సింగిల్ విండో ఆవరణలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 220 బస్తాల యూరియా దిగుమతి కావడంతో రైతులు పెద్ద ఎత్తున సింగిల్ విండో కార్యాలయానికి చేరుకొని తమకు కావలసిన మేరకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అప్పటికే విండో సిబ్బంది కొందరి రైతుల వద్ద దొంగ చాటుగా పాసు బుక్కులు తీసుకొని సీరియల్ పెట్టటంతో ఇందుకు బాధ్యులెవరని రైతులు ప్రశ్నించడంతో సిబ్బంది రైతుల మధ్య వాగ్వి వాదం చోటు చేసుకుంది. దీంతో స్థానిక ఎస్సై వెంకట్ రావు తన సిబ్బంది సహకారంతో విండో కార్యాలయానికి చేరుకుని రైతులు, విండో సిబ్బంది ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదానికి కౌన్సిలింగ్ ద్వారా ఒక రైతుకు ఒక యూరియా బస్తా చొప్పున అందజేసి మిగిలిన రైతులకు తదుపరి వచ్చే యూరియా దిగుమతిగాను ముందుగానే టోకెన్లు పంపిణీ చేసి రైతులను శాంతింప చేశారు.
రైతులకు సక్రమమైన పద్ధతిలో యూరియా అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES