– బారులు తీరిన రైతులు..
– 10 టన్నుల యూరియా గంటలోపే ఖతం..
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలో వరి రైతులకు యూరియా కొరత వలన అనిశ్ఛితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత ఉండడంతో యూరియా కొనేందుకు రైతులు బారులు తీరుతున్నారు. పలు జిల్లాలో ఎన్నో సంఘటనలు ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. ఇటీవలే ఖండేబల్లూర్ సొసైటీకి వచ్చిన 10 టన్నుల యూరియా చూస్తూ చూస్తూ ఉండగానే గంటలోపే యూరియా మందు సంచులను రైతులు వేచి ఉండి కొనుక్కొని తీసుకెళ్లిపోయారు. మిగిలిన రైతులు ఎడమొహం , పెడ మొహం వేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. రైతులు తెలిపిన వివరాలు ప్రకారం జుక్కల్ మండలంలోని 2వేల ఎకరాలలో వరి సాగు చేస్తున్నట్టు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
వీటికి సరిపోడానికి వ్యవసాయ అధికారులు 30 టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగిందని తెలిసింది. అందులో భాగంగా ఇటీవలే పది టన్నుల యూరియా మండలంలోని ఖండేబల్లూర్ సొసైటీ కి వచ్చిందని రైతులకు తెలియగానే బారులు తీరారు. క్యూ లైన్ లో నిలబడ్డారు. వరుసగా చెప్పులు , పాసుపుస్తకాలు , ఆధార్ కార్డులు , వాటర్ బాటిళ్లు , కవర్లు ,చేతి సంచులు క్యూ లైన్లో బారులుగా పెట్టి వేచి చూశారు.
జుక్కల్ విండో కార్యదర్శి బాబురావు పర్యవేక్షణలో జుక్కల్ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి ఎటువంటి సంఘటనలు జరగకుండా సామరస్యంగా రైతులకు యూరియా చేరే విధంగా చర్యలు చేపట్టారు. వచ్చిన పది టన్నుల యూరియా గంటలోపే ఖతం కావడంతో యూరియా దొరికిన రైతులు సంతోషం వ్యక్తం చేయగా, దొరకని రైతులు ఆందోళనలో ఎడమొహం , పెడమ్మోహం వేసుకొని వెనిదిరిగి విచారంగా వెళ్ళిపోయారు. చేసేది ఏమీ లేక , అనడానికి ఏమి రాక, గమ్మున వెళ్లిపోవడంతో రైతుల ఆవేదన వారి సమస్య వారి మనసులోనే దాచుకొని దేవుడే ఎరుగని విచార వదంతో వెని తిరిగారు.
మండలంలో నెలకొన్న యూరియా అనిశ్ఛితి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES