Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంయూరియా అందుబాటులోకి వస్తుంది: మంత్రి తుమ్మల

యూరియా అందుబాటులోకి వస్తుంది: మంత్రి తుమ్మల

- Advertisement -

– రైతులెవరూ ఆందోళన పడవద్దు..
నవతెలంగాణ – అశ్వారావుపేట

యూరియా అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేసారు. ఆదివారం ఆయన యూరియా అంశం పై అశ్వారావుపేట లోని తన వ్యవసాయ క్షేత్రంలో విలేఖర్లతో మాట్లాడారు. ఖరీఫ్ – 2025 వ్యవసాయ సీజన్ కొరకు కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రంలో 2025 ఏప్రిల్  నాటికి ఉన్న 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వలను పరిగణనలోకి తీసుకుని,మొత్తం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కేటాయించింది.

గత 5 ఖరీఫ్ సీజన్లలో రాష్ట్రంలో యూరియా యొక్క సగటు వినియోగం 9.82 లక్షల మెట్రిక్ టన్నులు గా ఉంది అని,ఆగస్టు నెల వరకు  మొత్తం అవసరమైన 8.30 ఎల్ఎంటిఎస్ యూరియా కి గాను 5.95 ఎల్ఎంటీఎస్ మాత్రమే సరఫరా అయిందని,దీంతో 2.35 ఎల్ఎంటీఎస్  కొరత ఏర్పడింది అన్నారు.వినియోగాన్ని ముందుగానే అంచనా వేసి, ప్రణాళికకు అనుగుణంగా యూరియా కేటాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి ని లేఖల ద్వారా,స్వయంగా కలుసుకుని అభ్యర్థించానని అన్నారు.నెలవారీ కొరతను గమనించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం 2025 జూలై 8 న కేంద్ర ఎరువుల శాఖ మంత్రిని కలసి, తగిన యూరియా కేటాయింపును కోరారు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం నుండి అదనంగా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు లభించింది అని హర్షం వ్యక్తం చేసారు.తూర్పు తీరంలోని వివిధ నౌకా శ్రయాలకు కాకినాడ, కారైకాల్,కృష్ణపట్నం, దాంర్రా, గంగవరం పోర్టుల నుండి 7 ఇంపోర్ట్ మార్గాల నుండి 71,700 మెట్రిక్ టన్నుల యూరియా ను రాష్ట్రానికి కేటాయించబడింది అని, అందులో నుంచి రాష్ట్రానికి యూరియా సరఫరాలు జరుగుతున్నాయి అన్నారు. సెప్టెంబర్ నెలలో 1.60 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై ప్లాన్ ను వివిధ కంపెనీల ద్వారా ఆర్సీ ఎఫ్,క్రిభ్కో,స్పిక్,

ఎంసీఎఫ్ఎల్ మొదలైన ద్వారా సరఫరా చేయబడుతుంది అన్నారు.ప్రతి రోజు దాదాపు 8000 – 10000 మెట్రిక్ టన్నుల యూరియా ను అన్ని కంపెనీల ద్వారా  రాష్ట్రానికి  సరఫరా చేయడానికి ప్రణాళిక చేస్తూ రైతుల సరఫరా చేస్తూ రైతులు చెంతకు చేరుస్తున్నామని అన్నారు.గత 6 రోజులలో రాష్ట్రానికి 33,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయబడిందని తెలిపారు.రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది అని రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయడం మైంది అన్నారు.మండలానికి ఒకటి లేదా రెండు సొసైటీలు మాత్రమే ఉన్న ప్రాంతాలలో రైతు వేదికలను వాడుకొని గ్రామాల వారీగా,పాస్ పుస్తకాల ఆధారంగా ఒక రోజు ముందుగానే గ్రామాల వారిగా టోకెన్లు జారీ చేసి రైతులకు ఎరువులు అందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ పంపిణీ ప్రక్రియలో ఎక్కడా అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటూ,కోఆపరేటివ్ మరియు మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.రైతులు ప్రస్తుత పంట దశలో సకాలంలో ఎరువులు పొందటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నందున రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, ఒకేసారి అధిక మొత్తంలో నిల్వ చేసుకోవద్దని తెలియ చేయడమైనది.రాష్ట్రంలో దాదాపు 901 సొసైటీలు  320 సబ్ సెంటర్లు 705 ఆగ్రో రైతు సేవా కేంద్రాలు 110 హాకా సెంటర్లు కాకుండా 495 రైతు వేదికల ద్వారా యూరియా సరఫరా చేస్తామని,ఇవి కాకుండా 11,000 ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా యూరియా పంపిణీ చేస్తామని అన్నారు ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా అధికారుల పర్యవేక్షణలో అమ్మకాలకు ఆదేశించామని తెలిపారు.బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు అమ్మితే వ్యవసాయ శాఖ కఠిన చర్యలు తీసుకొంటుంది అని హెచ్చరించారు.

మరో వారం రోజుల్లో రాష్ట్రానికి చేరనున్న 30,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవుతుందని,కేంద్రం నుంచి గత సంవత్సరం అదనంగా స్టాక్స్ రావడంతో ప్రతీ జిల్లాలో నిల్వలుండటం చేత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అవసరం మేరకు 8.33 ఎంటీఎస్  కొనుగోలు చేశారు అని తెలిపారు.గత సంవత్సరం ఇదే సమయానికి 7.98 ఎల్ఎంటుఎస్ మాత్రమే విక్రయాలు జరిగి మరో 3.52 ఎల్ఎంటీఎస్ టన్నులు అందుబాటులో ఉన్నాయి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్దమై, మార్క్ ఫెడ్ కు 1200 కోట్లు కేటాయించి, ఎప్రిల్, మే, జూన్ లలో కొనుగోలు చేసి, బఫర్ స్టాక్స్ పెంచుకొనే ఉద్దేశ్యముతో ఎప్రిల్ నుండి పలుమార్లు విజ్ఙప్తి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వము నుండి కేటాయింపుల ప్రకారం యూరియా సరఫరా చేయలేదు అన్నారు. అంతేగాక విజ్ఙప్తి చేసిన ప్రతీసారి,మన రాష్ట్రానికి అవసరైమనప్పుడు సరఫరా చేస్తాం అనే ప్రత్యుత్తరం వచ్చేది అన్నారు.

ఆర్ఎఫ్సీ మూత పడటంతో సరఫరాను బాగా దెబ్బతీసింది అని, ఐనప్పటికీ గత నెల కంటే ఈ నెల సరఫరా పూర్తి స్థాయిలో పెరగడంతో (4.4 %) అధికంగా రైతులకు అందించ గలిగాం అన్నారు.ఎక్కడా స్టాక్స్ లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురై,విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి అని,రాష్ట్రంలో అక్కడక్కడా కొంతమంది ఏదో ప్రయోజనం ఆకర్షించి రైతులను రెచ్చగొట్టడం లాంటివి చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని,రైతులు ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.రాష్ట్రం రైతు ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నది అని,రానున్న వారం రోజుల్లో అందరికి అవసరమైనంత మేర యూరియా అందించ గలం అని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad