Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంసర్‌ కోసం ఉరుకులు పరుగులు

సర్‌ కోసం ఉరుకులు పరుగులు

- Advertisement -

బెంగాల్‌ వలస కార్మికుల వెతలు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియ వలస కార్మికులను ఇబ్బంది పెడుతోంది. ఓటర్ల జాబితాలో పేరు ఉండేలా చూసుకునేందుకు వారంతా స్వరాష్ట్రానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు కార్మికులు ఉపాధి కోసం కేరళ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు వలస పోయారు. వారంతా ఇప్పుడు హడావిడిగా బెంగాల్‌ చేరుకుంటు న్నారు. సర్‌ ప్రక్రియలో పాల్గొనకపోతే ఓటు హక్కు ఎక్కడ పోతుందోనన్న భయం వారిని వెంటా డుతోంది. ఓటు హక్కును కాపాడుకు నేందుకు అవసరమైన పత్రాలను కూడా వారు సమకూర్చుకోవాల్సి వస్తోంది. పత్రాలను ఆన్‌లైన్‌లో పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ వాటి ని ఎలా పొందాలో, ఎలా నింపాలో చాలా మందికి తెలియడం లేదు.

పశ్చిమ బెంగాల్‌ సహా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్‌ ప్రక్రియ చేపట్టబోతున్నట్లు గత నెల 27న కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. వచ్చే నెల 4వ తేదీ వరకూ ఎన్యూమరేషన్‌ పత్రాలను సమర్పించవచ్చు. ఆ తర్వాత డిసెంబర్‌ 9న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురిస్తారు. వచ్చే సంవత్సరం జనవరి 8 వ తేదీ వరకూ క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరించి ఫిబ్రవరి 7న తుది జాబితాను ప్రచురిస్తారు. సొంత రాష్ట్రానికి వెళ్లి ఈ ప్రక్రియలో పాల్గొనే కార్మికులు తమ వేతనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కొందరు వలస కార్మికుల వద్ద బెంగాల్‌ వెళ్లేందుకు తగిన డబ్బు కూడా లేదు. గత ఎనభై సంవత్స రాలుగా కొల్‌కతాలో ఓటర్లుగా ఉన్నామని, ఇప్పుడు తమ పేర్లను తొలగిస్తారేమోనని భయంగా ఉన్నదని ముంబయిలో ఉంటున్న ఓ వ్యక్తి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -