Friday, June 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం30 దేశాలపై అమెరికా దాడులు

30 దేశాలపై అమెరికా దాడులు

- Advertisement -

చిట్టాను విడుదల చేసిన చైనా ఎంబసీ
మాస్కో : ప్రపంచానికి అసలైన ముప్పు అమెరికానే అని మాస్కోలో చైనా ఎంబసి విమర్శించింది. ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ చేసిన దాడిని పశ్చిమ దేశాలు, అంతర్జాతీయ మీడియా తీవ్రంగా ఖండిస్తున్నాయని కానీ అదేసమయంలో అమెరికా గత చరిత్రను అందరూ పూర్తిగా విస్మరిస్తున్నారని పేర్కొంది. రెండో ప్రపంచయుద్ధ కాలం నుండి అమెరికా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై జరిపిన బాంబు దాడుల జాబితాను చైనా ఎంబసీ విడుదల చేసింది. మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ భద్రత వంటి విషయాల్లో అమెరికా, పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను బహిర్గతం చేస్తూ ఈ జాబితాను ప్రచురించారు.
అమెరికా దాదాపు 30 దేశాలపై దాడులు జరిపింది. అమెరికా దాడులతో కొన్ని ప్రశ్నలు ఎదరువుతాయని… అమెరికాపై పశ్చిమ దేశాల సమాజం ఎన్నడైనా ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిందా?, అమెరికాకు వ్యతిరేకంగా గట్టిగా తన వాణిని వినిపించిందా ?, అమెరికాపై ఒక్కసారైనా ఎవరైనా ఆంక్షలు విధించారా?.. అని ప్రశ్నించింది.
‘అంతర్జాతీయ సమాజం అని మనం పిలుచుకునే ఈ ప్రపంచ వ్యవస్థ మౌన ప్రేక్షకురాలిలా చూస్తూ వుండిపోయిందని పేర్కొంది. మరోవైపు అమెరికా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై బందిపోట్ల మాదిరి దాడులు చేస్తూ వారి కలలను భయానకమైన పీడకలలుగా మారుస్తోంది. అయినా ఎలాంటి ఖండనలు లేవు, ఎలాంటి మందలింపులు లేవు, అసలు ఏ రకమైనా ఆగ్రహం లేదు. పిరికి, సిగ్గులేని, కపట ప్రపంచపు మనస్సాక్షి ఇది’ అని పేర్కొంది.
ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ ప్రతీకార చర్యగా దాడి చేయగానే అమెరికా దాని మిత్రపక్షాలు ఇరాన్‌ను ప్రపంచ ముప్పుగా పేర్కొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ప్రపంచడానికి నిజమైన ముప్పు ఎవరో గుర్తు చేయడానికి చైనా ఎంబసీ ఈ జాబితాను విడుదల చేసింది. అమెరికా చరిత్ర, వర్తమానాన్ని చూస్తే అన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలే, అంతర్జాతీయ దురాక్రమణలేనని అందువల్ల నైతికత గురించి మాట్లాడే అర్హత అమెరికాకు లేదని చైనా స్పష్టం చేసింది.

రెండో ప్రపంచ యుద్ధం నుంచి వివిధ దేశాలపై అమెరికా బాంబు దాడుల జాబితా
– 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్‌పై అణుబాంబులు
– కొరియా, చైనాలపై 1950-53 (కొరియా యుద్ధం)
– గ్వాటెమాలా (1954, 1960, 1967, 1969)
– ఇండోనేషియా (1958)
– క్యూబా (1959, 1961)
– కాంగో (1964)
– లావోస్‌ (1964)
– వియత్నాం (1961-1973)
– కంబోడియా (1969-1970)
– గ్రెనడా (1983)
– లెబనాన్‌ (1983, 1984) (లెబనాన్‌ సిరియాల్లో లక్ష్యాలపై దాడులు)
– లిబియా (1986, 2011, 2015)
– ఎల్‌ సాల్వడార్‌ (1980, నికరాగ్వా (1980)
– ఇరాన్‌ (1987)
– పనామా (1989)
– ఇరాక్‌ (1991-గల్ఫ్‌యుద్ధం) 1991-2003 (అమెరికా, బ్రిటీష్‌ దాడులు), 2003-2015
– కువైట్‌ (1991)
– సోమాలియా (1993, 2007-2008, 2011)
– బోస్నియా (1994, 1995)
– సూడాన్‌ (1998)
– ఆఫ్ఘనిస్తాన్‌ (1998, 2001-2015)
– యుగోస్లోవియా (1999), యెమెన్‌ (2002, 2009, 2011, 2024, 2025)
– పాకిస్తాన్‌ (2007-2015)
– సిరియా (2014-2015)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -