– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
– కంచన్‌బాగ్ బీడీఎల్‌లో సెమినార్
నవతెలంగాణ- చంపాపేట్
ఇరాన్‌పై అమెరికా ప్రోద్భలంతో కొనసాగుతున్న దాడులు ప్రపంచ శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని హైదరాబాద్ పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ (సీఐటీయూ) కమిటీ నేత, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ బీడీఎల్‌లో సోమవారం జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం జరుగుతున్నది సాధారణ ఘర్షణ కాదని, ఒక మారణహోమం అని చెప్పారు. చమురు, సహజ వనరులపై ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశంతోనే అమెరికా అన్యాయంగా, చట్టవ్యతిరేకంగా ఇరాన్‌పై దాడులు చేపడుతోందని విమర్శించారు. ఇరాక్ తర్వాత వెనెజులా, ప్రస్తుతం ఇరాన్‌పై దాడులు సామ్రాజ్యవాద ధోరణికి నిదర్శనమన్నారు. డొనాల్డ్ ట్రంప్ అక్రమ సుంకాలు, సైనిక చర్యల ద్వారా ప్రపంచంపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తోందన్న ఆరోపణలు ఆధారరహితమని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ, అమెరికా వాటిని పట్టించుకోలేదని అన్నారు. 2025 జూన్‌లో 12 రోజులపాటు అమెరికా, ఇజ్రాయెల్ బాంబర్లు ఇరాన్ నగరాలపై దాడులు జరపడంతో అమాయక ప్రజలు ప్రాణం కోల్పోయారని తెలిపారు. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా సంక్షోభంలోకి నెట్టాయన్నారు. ఈ అంతర్జాతీయ ఘర్షణలు భారత భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు. భారత్ ప్రభుత్వం అలీనోద్యమ స్ఫూర్తికి కట్టుబడి శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జె.వెంకటేష్, టి.సత్తయ్య, పి.మురళి, దానకర్ణాచారి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రపంచానికి ముప్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



