- Advertisement -
- సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
వెనిజులపై అక్రమంగా అమెరికా చేస్తున్న దాడులను ప్రజలందరూ ఖండించాలని సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ..వెనుజులలో ఉన్న ఆయిల్ సంపదలను దోచుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నాగం పని మాదకద్రవ్యాలు అమ్ముతున్నారని ఒక సాకు చూపి వెనిజులా దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అతని భార్యను అక్రమంగా బంధించి అమెరికాకు తీసుకపోయి జైల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
ట్రంపు చేస్తున్న అరాచకాలను యావత్ ప్రపంచం ఖండించాలనీ,వెనిజులపై దాడి చేసి ప్రపంచంలో ఉన్న చిన్న దేశాలను భయపెట్టాలని తన మాట వినని ఏ దేశమైనా ఇలాంటి పరిస్థితిఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నాడన్నారు.ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకొని వెనజులపై చేస్తున్న దాడులను ఆపించాలని వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యను విడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జవ్వాజి విమల, సిపిఐ(ఎం) నాయకులు సిరిమల్లె సత్యం ఎలిగేటి రాజశేఖర్ బింగి సంపత్ సందు పట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



