నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతీకార సుంకాలతో అమెరికా-చైనా మధ్య రసవత్తర పోరు సాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టారిఫ్‌లపై చర్చల ప్రతిపాదనలతో అమెరికా ముందుకు రాగా..చైనా అందుకు సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో శనివారం స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఇరుదేశాల వాణిజ్య అధికారులు సమలోచనలు చేశారు. సుమారు పది గంటలకు పైగా యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, చైనా వైస్ ప్రీమియర్ హి లిఫెంగ్ చర్చలు సాగించినా.. పలు అంశాలపై సయోధ్య కుదరలేదు. తాజాగా ఆదివారం జెనీవా వేదికగా మరోసారి అమెరికా-చైనా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రతీకార సుంకాలపై రెండు దేశాలు సరైన నిర్ణయం తీసుకుంటాయని, ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గత నెలలో టారిఫ్ లపేరుతో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య పోరు ప్రారంభించిన విషయం తెలిసిందే. పలు దేశాలపై సుంకాలు పెంచి, ఆ తర్వాత నాటకీయ పరిణామాలతో తన నిర్ణయాన్ని 90 రోజులపాటు నిలుపుదల చేసిన ట్రంప్.. చైనాకు మినహాయింపు ఇవ్వకుండా సుంకాల పరిధిని పెంచుకుంటూ పోయారు. అదే స్థాయిలో అమెరికా అధ్యక్షునికి దీటుగా జవాబు ఇచ్చింది బీజింగ్ ప్రభుత్వం. చైనా దిగుమతులపై అమెరికా 145 శాతం కనీస టారిఫ్‌ను విధించింది. చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం సుంకాన్ని విధించిన విషయం తెలిసిందే. అయితే తాజా చర్చలతో ఇరుదేశాల మధ్య ట్రేడ్ వార్‌కు తెరపడనుందని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టారిఫ్‌లపై యూఎస్-చైనా మధ్య సుధీర్ఘ చర్చలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES