Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలువెనిజులపై అమెరికా సామ్రాజవాద దాడి సిగ్గుచేటు

వెనిజులపై అమెరికా సామ్రాజవాద దాడి సిగ్గుచేటు

- Advertisement -
  • సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి జహంగీర్

నవతెలంగాణ-భువనగిరి: వెనిజులాపై అమెరికా సామ్రాజవాద కాంక్షతో దాడి చేసింద‌ని, ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న అధ్యక్షులు నికోల మధురోను, ఆయన భార్యని అక్రమంగా అరెస్టు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు, సోమవారం స్థానిక బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచశాంతి కామాకుడిగా గొప్పలు చెప్పుకుంటున్న డోనాల్డ్ ట్రంప్.. పక్క దేశాలపై బాంబు దాడులకు పాల్పడడం సిగ్గుచేటఅని, అమెరికా సామ్రాజ దురాక్రమకు ఖండించాలన్నారు. వెనిజులా చుట్టూ తన సైనిక నావికాదళాలను అమెరికా మోహరించింద‌ని మండిప‌డ్డారు. స్వతంత్ర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ప్రజల తీర్పును కాలు రాసే ప్రభుత్వాలను కులదోసె కుట్రలు చేయడం అమెరికా సామ్రాజ్యవాదానికి అలవాటుగా మారిందని, వెనిజులా సహజ వనరులపై కన్నేసి, అక్కడి ప్రజల ఆత్మ గౌరవాన్ని, స్వయం నిర్ణయ హక్కులను తుంగలో తొక్కుతూ దౌర్జన్య చర్యలకు అమెరికా పాల్పడుతుంద‌ని ధ్వ‌జ‌మోత్తారు.

పశ్చిమార్ధగోళంలో అమెరికా దళాల కేంద్రీకరణ, మొత్తం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకురావాలని ఉద్దేశాన్ని ట్రంపు ప్రకటించడం పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అని అన్నారు అమెరికా దురాక్రమాలకు వెంటనే ముగించాలని, వెనిజులా దేశ అధ్యక్షుడు మధురో ఆయన సతీమణి సిలియను వెంటనే నిర్బంధం విడిచి పెట్టాలని, ప్రపంచ ప్రజలకు అమెరికా సామ్రాజవాదం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, బురుగు కృష్ణారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మాయ కృష్ణ ,సిర్పంగి స్వామి, దోడ యాదిరెడ్డి, కోట రామచంద్రారెడ్డి, గడ్డం వెంకటేష్ , బొమ్మలరామారం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, నాయకులు ఎదునూరి మల్లేశం, గడ్డం వాణీ, జిల్లా ఆఫీస్ కార్యదర్శి వల్లపుదాసు రాంబాబు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -