వాషింగ్టన్ : అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అమెరికా న్యాయశాఖ.. కాంగ్రెస్ సెనెట్, హౌస్ న్యాయ కమిటీల నాయకులకు ఒక లేఖను పంపింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఏయే భాగాలను, ఎందుకు రిడాక్ట్ (తొలగింపులు, దాచివేతలు, బ్లాక్ చేయడం) చేసిందో ఆ లేఖలో వివరించింది. ప్రస్తావనలో ఉన్న ప్రముఖుల జాబితా కూడా ఈ మేరకు జత చేసింది. ఈ లేఖలో.. చేసిన రిడాక్షన్ల రకాలపై సాధారణ వివరణ ఉంది. అలాగే ఫైల్స్‌లో ఎలాంటి సందర్భంలోనైనా ప్రస్తావనకు వచ్చిన ప్రముఖుల విస్తృత జాబితా ఉంది. అయితే ఆ పేర్లు ఏ సందర్భంలో వచ్చాయో, వారు ఎప్‌స్టీన్ లేదా ఆయన సహచరులు గిస్లైన్ మాక్స్‌వెల్‌తో సంబంధం కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని మాత్రం ఈ లేఖ స్పష్టంగా తెలియజేయలేదు.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో రిడాక్షన్లపై చట్టసభ సభ్యులకు అమెరికా న్యాయశాఖ లేఖ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


