హిందూ మహాసముద్రం మధ్యలో ‘వెరోనికా 3’ తనిఖీ
వాషింగ్టన్ : అమెరికా సైనిక దళాలు వెనిజులాకు చెందిన మరో ఆయిల్ ట్యాంకర్‌పై చర్యలకు దిగాయి. ఆంక్షలు విధించబడిన ఆయిల్ ట్యాంకర్ వెరోనికా 3లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించాయి. హిందూ మహాసముద్రంలో అమెరికా సైన్యం ఈ చర్యకు దిగింది. ఇది ఈనెలలో ఇదే ప్రాంతంలో అమెరికా సైనిక దళాలు బోర్డింగ్ చేసిన రెండో నౌక కావడం గమనార్హం. వెనిజులా చమురు ఎగుమతులను అడ్డుకోవడంలో అమెరికా మరింత కఠిన వైఖరిని అవలంభిస్తున్నట్టు తాజా చర్య సూచిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. వెనిజులా ఆయిల్ ట్యాంకర్ సుమారు రెండు మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను తీసుకెళ్తున్నట్టు సమాచారం. అమెరికా సైన్యం దీనిని రైట్ ఆఫ్ విజిట్ ప్రక్రియ కింద ఆపి తనిఖీ చేసింది. ఇదే నెలలో హిందూ మహాసముద్రంలో అక్విలా 2 అనే మరో ట్యాంకర్‌ను కూడా అమెరికా ఆపింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఆయిల్ నిర్బంధాన్ని ఈ నౌక ఉల్లంఘించిందని పెంటగాన్ ఆరోపిస్తోంది. అమెరికా.. వెనిజులాపై అనేక ఏండ్లుగా ఆంక్షలు అమలు చేస్తోంది. చమురు ఎగుమతుల ద్వారా వెనిజులాకు వచ్చే ఆదాయాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఇది కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న అమెరికా.. తన ఆంక్షలతో ఆ దేశాన్ని నియంత్రిస్తున్నది. వెనిజులా షాడో ఫ్లీట్ (అంటే జెండాలు మార్చడం, ట్రాకింగ్ సిస్టమ్ ఆఫ్ చేయడం వంటి మార్గాలతో) ద్వారా చమురును గ్లోబల్ మార్కెట్‌కు పంపుతోందని అమెరికా ఆరోపిస్తున్నది. ఇండో-పసిఫిక్ కమాండ్ పరిధిలో ఈ చర్య జరిగినట్టు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా సైన్యం విడుదల చేసిన వీడియోలో సైనిక సిబ్బంది సముద్ర మధ్యలో నౌక వద్దకు చేరుకుని అందులోకి ఎక్కుతున్న దృశ్యాలు కనిపించాయి. ”దూరం మీకు రక్షణ ఇవ్వదు.
వెనిజులా ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా సైనిక చర్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



