నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులాపై అమెరికా ఆర్మీ దాడులను చీలి అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ఖండించారు. దుందుడుకు చర్యలతో ఆదేశ ప్రెసిడెంట్ నికోలస్ మదురోను, ఆయన భార్యను కస్టడీలోకి తీసుకోవడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్దమని శనివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇరుదేశాల మధ్య ఉత్పనమైన సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, శాంతి యుతంగా ఆయా దేశాల సౌర్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని ఆయన పేర్కొన్నారు. బలప్రయోగం ద్వారా ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని, ఆ దేశ సమగ్రతకు భంగం కలించడమని చెప్పారు.
ఇరుదేశాల మధ్య నెలకొన్న విపత్కర పరిస్థితులను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అంతర్జాతీయ దేశాల మధ్యవర్తిత్వంతో సంక్షోభానికి ముగింపు పలికాలని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ సూచించారు. అమెరికా చర్యలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. బలాన్ని ఉపయోగించడం, నిషేధించడం, జోక్యం చేసుకోకపోవడం, అంతర్జాతీయ శాంతికి విఘాతమని వాపోయారు.



