Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeఆటలుయూఎస్ ఓపెన్ విజేత అరీనా సబలెంక

యూఎస్ ఓపెన్ విజేత అరీనా సబలెంక

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంక యూఎస్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుతమైన ఆటతీరుతో అమెరికా క్రీడాకారిణి అమందా అనిసిమోవాను ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. దశాబ్దం క్రితం సెరెనా విలియమ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా సబలెంక రికార్డు నెలకొల్పింది. ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన తుది పోరులో సబలెంక 6-3, 7-6 (3) తేడాతో విజయం సాధించింది. ఇది ఆమె కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad