Saturday, August 2, 2025
E-PAPER
Homeబీజినెస్నేటి నుంచే అమెరికా హెచ్చు సుంకాలు అమలు

నేటి నుంచే అమెరికా హెచ్చు సుంకాలు అమలు

- Advertisement -

– రాష్ట్రంలోని పలు రంగాలపై ప్రభావం
– అక్వా రైతులకు భారీ నష్టమే
– జీవనోపాధికి దెబ్బ
నవతెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన హెచ్చు సుంకాలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్‌ను అత్యంత సన్నిహిత మిత్రదేశంగా పేర్కొంటూనే 25 శాతం టారిఫ్‌లను విధించారు. ఆగస్టు 1 గడువు ముందు భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరగాల్సి ఉండగా.. ఇంకా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ట్రంప్‌ అధిక సుంకాలను అమల్లోకి తీసుకురావడం గమనార్హం. ట్రంప్‌ చర్యలతో ప్రధానంగా భారత ఎగుమతి రంగాలైన ఆటో పరికరాలు, స్టీల్‌, అల్యూమినియం, జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ, టెక్స్‌టైల్స్‌, సముద్రపు ఉత్పత్తులపై ప్రధానంగా ప్రభావం పడనుంది.
అమెరికా విధించిన సుంకాలు ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రొయ్యల ఎగుమతి రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారతదేశ మొత్తం రొయ్యల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్‌ 70 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఈ రంగంపై దాదాపు 10 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అంచనా. ట్రంప్‌ ప్రకటించిన 25 శాతం టారిఫ్‌లు ఈ రంగానికి తీవ్ర ఆటంకం కలిగిస్తాయని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. అధిక సుంకాలలో అమెరికా భారత రొయ్యల ధరలు పెరుగుతాయి. దీంతో పోటీతత్వాన్ని ఎదుర్కోలేవు. ఫలితంగా ఎగుమతి ఆదాయం తగ్గడంతో రొయ్యల సాగుదారులు నష్టాలను చవి చూసే ప్రమాదం ఉంది. ఈ రంగంలోని సంబంధిత ఉద్యోగులు, కూలీల జీవనోపాధి దెబ్బతిననుంది. అదే విధంగా టారిఫ్‌లు రాష్ట్రంలోని వ్యవసాయం, ఐటీ, తయారీ రంగాలను ఒత్తిడి గురి చేయనున్నాయి. మామిడి, మసాలాలు, బియ్యం తదితర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోనున్నాయి. దీంతో ఈ రంగంలోని రైతులు స్థానిక మార్కెట్లపై లేదా ఇతర దేశాల మార్కెట్లపై ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది. ఎగుమతి ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ, అక్వా రంగంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మందగించనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -