Wednesday, February 11, 2026
E-PAPER
Homeబీజినెస్బంగ్లాదేశ్‌ వస్త్రాలపై యూఎస్‌ జీరో టారిఫ్‌

బంగ్లాదేశ్‌ వస్త్రాలపై యూఎస్‌ జీరో టారిఫ్‌

- Advertisement -

భారత ఎగుమతిదారుల్లో ఆందోళన
న్యూఢిల్లీ :
అమెరికా, బంగ్లాదేశ్‌ మధ్య కుదిరిన పరస్పర వాణిజ్య ఒప్పందం భారత వస్త్ర ఎగుమతిదారుల్లో కలవరం రేపుతోంది. బంగ్లాదేశ్‌ వస్త్ర ఉత్పత్తులపై యూఎస్‌ సుంకాలను ఎత్తి వేయడం వల్ల అక్కడి మార్కెట్‌లో భారత ఉత్పత్తు లు తీవ్ర పోటీని ఎదుర్కోనున్నాయి. దీంతో అంత ర్జాతీయ మార్కెట్లో భారత వస్త్ర ఎగుమతిదారులు, దీనిపై ఉపాధి పొందుతున్న వారు తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్‌ నుండి ఏటా వేల కోట్ల రూపాయల కొద్దీ ఆర్డర్లు పొందే కాటన్‌ యార్న్‌ మార్కెట్‌ ఇప్పుడు అమెరికా పత్తి వైపు మళ్లే ముప్పు పొంచి ఉంది. ఇది కేవలం వ్యాపార నష్టం మాత్రమే కాదని.. మన దేశంలోని లక్షలాది మంది కార్మికుల ఉపాధిని దెబ్బతీసే ఒక ప్రమాదకర పరిణామని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి.

యూఎస్‌- బంగ్లాదేశ్‌ ఒప్పందంలోని లొసు గులు భారతీయ పరిశ్రమను ఒత్తిడికి గురి చేయ నున్నాయి. అమెరికా పత్తిని కొద్దిగా వాడి 100 శాతం వాడినట్టుగా బంగ్లాదేశ్‌ ఎగుమతిదారులు తప్పుడు క్లెయిమ్స్‌ చేసే అవకాశం ఉందని, దాన్ని అరికట్టే సరైన వ్యవస్థలు లేవని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు భారత్‌ 19 శాతం సుంకంతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు బంగ్లాదేశ్‌కు లభించిన ఈ జీరో టారిఫ్‌ వెసులు బాటు భారత టెక్స్‌టైల్‌ రంగానికి గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం కనిపిస్తోందని భావిస్తోన్నారు.

2024-25లో బంగ్లాదేశ్‌కు 1.47 బిలియన్‌ డాలర్ల విలువైన కాటన్‌ యార్న్‌ను భారత్‌ ఎగుమతి చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్‌ నేరుగా అమెరికా నుండి పత్తిని కొనుగోలు చేస్తే.. భారతీయ నూలు పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ టెక్స్టైల్‌ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్‌పై అధిక టారిఫ్‌ ల వల్ల ముఖ్యంగా 100 శాతం కాటన్‌ ఉత్పత్తులైన టీ షర్టులు, మహిళల దుస్తుల విభాగంలో మనం పోటీతత్వాన్ని కోల్పోయే అవకాశం ఉందని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు ఇచ్చినట్లే, అమెరికాలోని భారతీయ దుస్తుల ఎగుమతిదారు లకు కూడా ఇటువంటి వెసులుబాటు కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని అపారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఏఐపీసీి) చైర్మెన్‌ ఎ శక్తివేల్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమానమైన రాయితీలు సాధించకపోతే భారత వస్త్ర సామ్రాజ్యం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -