Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంనానో యూరియాను వాడండి: ఏఓ లక్ష్మణరావు

నానో యూరియాను వాడండి: ఏఓ లక్ష్మణరావు

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
యూరియా కు బదులుగా తక్కువ ఖర్చుతో నానో యూరియా ను వాడాలని మణుగూరు మండల వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం రైతులతో మాట్లాడుతూ.. నానో యూరియా అనేది ఒక ఆధునిక, స్మార్ట్ ఎరువు రూపం, ఇది తరచుగా సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా వాడుతుంది. ఇది ముఖ్యంగా భారతదేశంలో ఇండియన్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిందన్నారు. పంటల దిగుబడిని పెంపొందిస్తుందన్నారు. పంటలకు అవసరమైన నత్రజని ను సమృద్ధిగా అందిస్తుంది. మొక్కలలో క్లోరోఫిల్ ఉత్పత్తిని పెంచి వృద్ధిని వేగవంతం చేస్తుంది.

చెడు ప్రభావాలు లేకుండా తక్కువ మోతాదులో ఫలితం వస్తుందన్నారుకేవలం 500 ఎం.ఎల్ నానో యూరియా సాల్యూషన్ 1 బ్యాగ్ (45 కేజీలు) సాంప్రదాయ యూరియాకు సమానమన్నారు. భూమి సారం దెబ్బతినకుండా, నేల ఆరోగ్యం నరుస్తుందన్నారు. రసాయనిక యూరియా వాడకం తగ్గి, నేలలో సూక్ష్మజీవుల జీవితం నిలబెడుతుందన్నారు. నీటి వనరుల వినియోగాన్ని తగ్గిస్తుందన్నారు స్ప్రే రూపంలో వాడే కాబట్టి నీటిని తక్కువగా పడుతుందన్నారు.

పర్యావరణానికి మేలు చేస్తుందన్నారు నత్రజని మలినాలుగా భూమిలోకి లేదా నీటిలోకి చేరకుండా అడ్డుకుంటుందన్నారుఖర్చు తక్కువ, లాభం ఎక్కువ అన్నారు రైతులకు ఎరువుల కొనుగోలు ఖర్చు తగ్గుతుందన్నారు. సులభంగా వాడగల ఫార్మ్ సొల్యూషన్ ఇది స్ప్రేయర్ ద్వారా మొక్కల పైకి నేరుగా పిచికారీ చేయగలదు.ప్రతి ఎకరాకు 500 ఎం ఎల్ నానో యూరియా నీటిలో కలిపి, స్ప్రే చేయాలి అన్నారు. పంట పెరుగుదల దశలో  పిచికారీ చేయడం మంచిదని తెలిపారువర్షం ఉన్న రోజులలో పిచికారీ చేయకుండా ఉండాలన్నారువరి, గోధుమ, మొక్కజొన్న, శెనగ, కందులు, పత్తి, పప్పు ధాన్యాలు వంటి అన్ని ప్రధాన పంటల రైతులకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad