నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : గోదావరి అర్బన్ బ్యాంక్ సేవలను చిరు వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు వినియోగించుకోవాలని గోదావరి అర్బన్ బ్యాంకు మేనేజర్ కోరవేన రమేష్ తెలిపారు. మంగళవారం గోదావ సుదాన్ గోల్డ్ లోన్ సభ్యుల ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర బ్యాంకుల కంటే మెరుగైన సేవలు కస్టమర్లకు అందిస్తున్నామన్నారు. సీనియర్ సిటిజన్ లకు ,స్త్రీలకు డిపాజిట్లపై వడ్డీ శాతం ఎక్కువ ఉందని, తక్కువ వడ్డీకి, ఎక్కువ మొత్తంలో బంగారంపై రుణాలు ఇవ్వబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుదన్ గోల్డ్ లోన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక ,రాష్ట్రాల హెడ్ ఎన్నం పెల్లి సాయి కుమార్ ఏ.ఎస్.ఎమ్ వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ లక్ష్మణ్, గోదావరి సిబ్బంది పాల్గొన్నారు.
గోదావరి అర్బన్ బ్యాంక్ సేవలను వినియోగించుకోండి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES