Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యుఎస్ఎఫ్ఐ టెన్త్ టాలెంట్ టెస్ట్ కరపత్రాలను ఆవిష్కరణ

యుఎస్ఎఫ్ఐ టెన్త్ టాలెంట్ టెస్ట్ కరపత్రాలను ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఫిబ్రవరి 8వ తారీఖున నిర్వహించే పదవ తరగతి ప్రతిభ పరీక్ష కరపత్రాల ఆవిష్కరణ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్  మాట్లాడుతూ.. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు అలాగే భయాన్ని పోగొట్టడానికి యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఈ ప్రతిభ పరీక్షలను జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అలాగే యుఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పోషమైన మహేష్ మాట్లాడుతూ ..పదవ తరగతి చదువుతున్న విద్యార్థులలో భయాన్ని పోగొట్టడానికి అలాగే వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ప్రతి సంవత్సరం 10వ తరగతి ప్రతిభా పరీక్షను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని అలాగే ఈ ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిని భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకొని సమాజ మార్పుకు సమాజ అభివృద్ధి కు తోడ్పడాలని రకంగా ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుందని కావున పదవ తరగతి విద్యార్థులు అందరూ కూడా ఈ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేణు,మారుతి, నగర సహాయ కార్యదర్శులు శివ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -