- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం రేపు హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద యూఎస్పీఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యుఎస్పిసి స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇమ్మడి అశోక్, శేషగిరిరావు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ధర్నాను విజయవంతం చేయాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు వీరమల్ల బాబయ్య, ఎండి షరీఫ్, సిహెచ్ శ్రీనివాస్, దేవగిరి సూర్యములతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
- Advertisement -