Thursday, July 24, 2025
E-PAPER
Homeసినిమాబర్నింగ్‌ ఇష్యూతో 'ఉసురే'

బర్నింగ్‌ ఇష్యూతో ‘ఉసురే’

- Advertisement -

యదార్థ సంఘటనలతో, సమాజంలో జరిగిన వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఇప్పుడు ఈ కోవలోనే యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథ ‘ఉసురే’. టి.జరు అరుణాచలం, జననీ కునశీలన్‌ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్‌ డి.గోపాల్‌ దర్శకుడు.
శ్రీకష్ణ ప్రొడక్షన్స్‌ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్‌ పతాకంపై మౌళి ఎం రాధాకష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. సీనియర్‌ హీరోయిన్‌ రాశి ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ చిత్రంలోని పాటల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు నవీన్‌ డి.గోపాల్‌ మాట్లాడుతూ, ‘నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. ఇటీవల ట్రైలర్‌ను కమల్‌ హాసన్‌కి చూపించాను. ఆయనకు ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుం దని అభినందించారు. ఈ సినిమాను చిత్తూరులోని ఓ గ్రామంలో చిత్రీకరించాం. ఓ అచ్చ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్‌ ఉంటుంది. ఎంతో సహజంగా చిత్రీకరణ చేశాం’ అని అన్నారు.
‘ఇదొక రియల్‌ ఇన్‌సిడెంట్‌. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్‌ ఇష్యూని ఈ చిత్రంలో చర్చించాం. ప్రతి ఒక్కరి హదయానికి హత్తుకునే లవ్‌స్టోరీ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్‌ మదర్‌ పాత్రను రాశి చేశారు’ అని నిర్మాత చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -