Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్తి మంత్రే.!

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్తి మంత్రే.!

- Advertisement -

– సాగు నీళ్లు విడవడానికి ఆంక్షలా..?
– మేము ప్రాజెక్టులు నిర్మిస్తే మీరు కాలువల మట్టి కూడా తీయరా..?
– నీళ్ల కోసం మరో ఉద్యమం
– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్ 

ప్రాజెక్టుల నిర్మాణం కోసం త్యాగం చేసిన ప్రాంతం మాది.. ఎందరో త్యాగాల పునాదుల మీద కెసిఆర్ ఆకుంఠత దీక్షతో ప్రాజెక్టుల నిర్మించుకొని నీళ్లు విడుదల చేసుకున్నాం. ఈ త్యాగాల గడ్డకు ఎమ్మెల్యే హోదాలో నీళ్లు విడుదల చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాయపోల్ మండలం మంతూర్ -అనాజీపూర్ శివారులో 13 డి కాలువలో గోదావరి జలాలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం పరిధిలో సాగు నీరు అందించే  13 డి (రామాయంపేట) కాలువ నుండి నీళ్లు విడుదల చేస్తామంటే రాత్రి నుండి కలెక్టర్ కార్యాలయం,ఏసీపీ, నీటి పారుదల శాఖ అధికారులు ఫోన్ లు చేసి రాజకీయ ఒత్తిడి ఉందని కార్యక్రమంను అడ్డుకొని వారే విడుదల చేశారన్నారు. కేసీఆర్ హయాంలో తాము ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం  కాలువలలో పూడిక కూడా తీయడం లేదని విమర్శించారు.నీళ్లు వొస్తాయనే ఆశతో రైతులు సాగుచేసుకుంటే కాలువ నిండ పూడిక ఉండటంతో రైతులు తలా కొంత వేసుకొని పూడిక తీసుకోవడం జరిగిందన్నారు. రెండున్నర ఏళ్లుగా సిద్దిపేట జిల్లా సాగునీటి సమస్యలఫై  సమీక్ష నిర్వహించని భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మంత్రిగా మిగిలిపోయాడన్నారు.

రెండేళ్లుగా ఉప కాలువలు నిర్మించాలని అసెంబ్లీ సాక్షిగా గళ మెత్తనా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దుబ్బాక అంటేనే వ్యవసాయ నియోజకవర్గమని ఇక్కడ ప్రతి ఎకరాకు సాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉప కాలువల నిర్మాణం కోసం భూ సేకరణ, పరిహారం, నిర్మాణం అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఇర్కోడు ఎత్తి పోతల ప్రాజెక్ట్ కు  రూ. 111 కోట్లు మంజూరు అయినప్పటికీ ఇర్కోడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నత్త నడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని ఉప కాలువలు పూర్తి చేసి

 రైతంగానికి నీళ్లు ఇవ్వాలని లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం తరహా మరో ఉద్యమం నిర్మిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, స్థానిక సర్పంచ్ లు పర్వేజ్, సోమని నిర్మల ఇస్తారీ,వివిధ గ్రామాల సర్పంచ్ లు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -