Saturday, October 4, 2025
E-PAPER
Homeసినిమాఉత్తరగా..లయ నట విశ్వరూపం

ఉత్తరగా..లయ నట విశ్వరూపం

- Advertisement -

శ్రీ శివాజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై నటుడు శివాజీ నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటి లయ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. శివాజీ ప్రొడక్షన్‌ హౌస్‌లో రానున్న ఈ చిత్రానికి సుధీర్‌ శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈటీవీ విన్‌ ఆధ్వర్యంలో దీన్ని నిర్మిస్తున్నారు.. దసరా సందర్భంగా ఈనెల 2న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ ఇచ్చారు. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ మూవీ నుంచి దసరా స్పెషల్‌గా నటి లయ పోషించిన పాత్రకు సంబంధించిన పరిచయాన్ని చేశారు. లయ ఈ చిత్రంలో ఉత్తర అనే గహిణి పాత్రను పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్‌లో ఎన్నో వేరియేషన్స్‌ ఉన్నాయని పోస్టర్‌ను చూస్తేనే తెలుస్తోంది. పైకి ఒకలా.. లోపల ఇంకోలా ఎమోషన్స్‌ను దాచుకునే ఈ పాత్రలో లయ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

బయటకి సాధారణ మహిళగా కనిపిస్తూనే, లోపల క్రిమినల్‌ నేచర్‌ను దాచిపెట్టుకుంటూ, డ్యూయల్‌ బిహేవియర్‌తో (రెండు రకాల మనస్తత్వాలతో) సాగే ఈ పాత్రలో లయ తన నట విశ్వరూపాన్ని చూపించ బోతున్నారని చిత్ర బృందం తెలిపింది. తన కుటుంబం జోలికి వస్తే, ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడే వ్యక్తిగా, మల్టిపుల్‌ షేడ్స్‌ ఉన్న ఇలాంటి పాత్రలో లయ కనిపించబోతున్నారు.
ఈ పోస్టర్లో లయను, ఆమె చేతిలో ఉన్న ఆయుధాలను చూస్తే, ఆమె పాత్రలో ఎన్ని షేడ్స్‌ ఉంటాయో అర్ధం అవుతుంది. ఇక ఈ మూవీకి మిథిల్‌ కుమార్‌, సుధీర్‌ శ్రీరామ్‌ కథను అందించారు. ఈ సినిమాకు రిత్విక్‌ రెడ్డి కెమెరామెన్‌గా, రంజిన్‌ రాజ్‌ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -