కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయంలో ఉద్యోగుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించినట్టు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనేక సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెల్డర్లు బ్లాక్ స్మిత్ పోస్టులను 12 ఏండ్ల నుంచి భర్తీ చేయడం లేదని తెలిపారు. ఫైర్ మాన్ సీనియర్ ఎలక్ట్రీషియన్ పోస్టులను నాలుగేండ్ల నుంచి భర్తీ చేయడం లేదనీ, కార్పెంటర్ పోస్టులు ఏడేండ్ల నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ మెడికల్ బిల్లులు రీయింబర్స్‌మెంట్ ఇవ్వటానికి ఏండ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరెండర్ షిప్‌లో రెండు సంవత్సరాల నుంచి 30మందికి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు కనీసంగా ఇవ్వాల్సిన సబ్బులు, డ్రెస్సులు, బ్రెడ్‌లు పదేండ్ల నుంచి ఇవ్వడం లేదని ఆరోపించారు. చనిపోయిన కార్మిక కుటుంబాలకు జీపీఎఫ్ డబ్బులు ఐదేండ్ల నుంచి అందించడం లేదని కార్మికులు చెబుతున్నారని గుర్తు చేశారు. 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కరించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.దశరథ్. ప్రింటింగ్ ప్రెస్ యూనియన్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ ఆర్ ఈశ్వరయ్య, జనరల్ సెక్రెటరీ ఎమ్ శ్రీరామ్ సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, ట్రెజరర్ వాసు, తదితర నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



