Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెటర్నర్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి..

వెటర్నర్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి..

- Advertisement -

జిఎంపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ..
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 

జిఎంపిఎస్ బీబీనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో  శుక్రవారం  కొండమడుగు  పశువుల దవాఖానను గొర్ల కాపరులతో కలిసి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమానికి గొర్రెలమేకల పెంపకదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల నరసింహ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లంల సత్యనారాయణ లు హాజరై,  మాట్లాడుతూ.. కొండమడుగు హాస్పిటల్ పరిధిలో సుమారు 8 గ్రామాలు ఉండడంతో గొర్రెలు గాని పశువులు గాని అధిక సంఖ్యలో ఉన్నాయి కానీ ఒకే డాక్టరు ఉండడంవల్ల ఇక్కడ గొర్ల కాపరులకు , పశువుల కాపరులకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి.

ఈరోజు డాక్టరు సెలవు పెట్టడంతో హాస్పటల్ తాళం వేయడం జరిగిందని,  ఇట్లా అనేక ఇబ్బందులతో గొర్రెల మేకల పెంపకదారులు హాస్పటల్ చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నట్టలనివారణ మందులు లేక రెండున్నర సంవత్సరాలు అవుతుందని గొర్లకు కాలు, గొంతు వ్యాధితో బాధపడుతున్నాయని హాస్పటల్లో సరిగ్గా సిబ్బంది లేక సరిపడా మందులు లేక పెంపకదారులు ఇబ్బందులు పడుతున్నారని  అన్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు గాని  అటెండర్ పోస్టులను భర్తీ చేసి సరిపడే మందులు కేటాయించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు కడెం బీరప్ప, మాజీ సొసైటీ అధ్యక్షుడు కడెం బాలమల్లయ్య, కడెం రాజు, బాలకృష్ణ, దొడ్డి భార్గవ్, జమాల్, మిర్యాల కుమార్ ,గొరిగే సిద్దులు, అశోక్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -