Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖాళీగా ఉన్న పోస్టులకు సాధారణ ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలి

ఖాళీగా ఉన్న పోస్టులకు సాధారణ ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలి

- Advertisement -

టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు  ఆకుల బాబు
నవతెలంగాణ – కామారెడ్డి 

కేజీబీవీ, యు ఆర్ ఎస్, సహా సమగ్ర శిక్ష ఉద్యోగులకు స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు అనుమతితో పాటు ఖాళీల్లో సాధారణ బదిలీలకు కూడా అవకాశం ఇవ్వాలి టిఎస్ యుటిఎఫ్.( TSUTF) జిల్లా అధ్యక్షులు  ఆకుల బాబు ఒక ప్రకటనలో తెలిపారు.  కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల దంపతులకు (స్పౌజ్), పరస్పర(మ్యూచువల్) కేటగిరీలో బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని, వారి వివరాలను ఈనెల 26 లోగా ఎస్పీడి కార్యాలయానికి పంపాలని ఆదేశిస్తూ సమగ్ర శిక్ష, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ మెమో నెం 3638 ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ ఉత్తర్వులను టిఎస్ యుటిఎఫ్ స్వాగతిస్తున్నది. అయితే ఇటీవల పలు కెజిబివిలు అప్ గ్రేడ్ అయ్యాయి. కొందరు సిబ్బంది ఇతర ఉద్యోగాలకు పోవడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. పలువురు ఉద్యోగులు అతి తక్కువ వేతనంతో దూరప్రాంతాల్లో పని చేస్తూ బదిలీలు కోరుకుంటున్నారు. గత మూడు సంవత్సరాల్లో బదిలీలు జరిగినా వారిలో చాలా మందికి అవకాశం రాలేదు. వారికి మేలు జరిగే విధంగా నూతనంగా మంజూరైన, ఖాళీగా ఉన్న పోస్టుల్లో సాధారణ ఉద్యోగులకు  బదిలీ (షిఫ్టింగ్) కి అవకాశం కల్పించాలని, దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించాలని  టిఎస్   యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. సాయిలు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -