నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామంలో సోమవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం పశువులకు గాలి కుంటూ నివారణ టీకాల శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైకన్ జామున మహేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో 32 గోజాతి, 150 గేదె జాతి పశువులకు ఉచితంగా గాలి కుంటూ నివారణ టీకాలు వేసినట్లు చౌట్ పల్లి పశు వైద్యధికారి డాక్టర్ వసంత్ కుమార్ తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పశువుకు తప్పకుండ ఆరు నెలలకు ఒక్కసారి టీకా వేయించుకోవాలని సూచించారు.జీవాలు గాలికుంటూ వ్యాధి భారిన పడటంతో నోటిలో పుల్లతో చొంగ కారడం, కాలి డెక్కలలో పగుళ్ళు ఏర్పడి నడవలేకపోవడం, పాల ఉత్తప్తి తగ్గిపోవడము, చుడి పశువులు అబార్షన్స్ అవ్వడం వంటి లక్షణాలు ఏర్పడతాయి అన్నారు.
రైతులు ముందు జాగ్రత్త కోసం తప్పకుండ గాలికుంటూ నివారణ టీకాలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిలువేరి భూమేశ్వర్, రైతులు, పశువైద్య సిబ్బంది సత్యం, గోపాలమిత్ర స్పరన్, తదితరులు పాల్గొన్నారు.



