నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ 1 లో జుక్కల్ ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బంది శనివారం సెంటర్ పిల్లలకు వ్యాక్సినేషన్ చేశారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ తో పాటు , బాలింతలకు పౌష్టికమైన ఆహారం తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారం నేరుగా అంగన్వాడికి వచ్చి బుజించి వెళ్లాలని కోరారు. పౌష్టికాహార ప్యాకెట్లను ఇంటికి తీసుకొని వెళ్లి నిత్యం వాడాలని, వీటిద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. బాలింతలకు పాల శాతం పెరుగుతాయని, కూరగాయలు , గుడ్లు తదితర వస్తువులు ఆహారంతో కలిపి అందజేస్తారని తెలిపారు . బాలింతలు తప్పక అంగన్వాడి సెంటర్ లోనే భుజించాలని వైద్య సిబ్బంది విజ్ఞప్తి చేశారు.ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జుక్కల్ ఏఎన్ఎం అంబికా, అంగన్వాడి సెంటర్ 1 టీచర్ శకుంతల, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- జుక్కల్ 1 అంగన్వాడీ కేంద్రంలో వ్యాక్సినేషన్ చేస్తున్న వైద్య సిబ్బంది.