Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరి వేయించాలి

గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరి వేయించాలి

- Advertisement -

– పశుపూషకులందరూ సద్వినియోగం చేసుకోవాలి..
– రేపటి నుండి నవంబర్ 14 వరకు టీకాల కార్యక్రమం..
– పశు వైద్యాధికారి రాజేష్ కుమార్..
నవతెలంగాణ – ఊరుకొండ

ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గాలికుంటూ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పశువైద్యాధికారి రాజేష్ కుమార్ తెలిపారు. మంగళవారం ఊరుకొండ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు నేటి నుండి నవంబర్ 14 వరకు మండలంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పశుపోషకులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. పశుపోషకులు గాలికుంటు వ్యాధి వల్ల వచ్చే నష్టాన్ని నివారించుకునేందుకు ముందస్తుగా టీకాలు వేయించుకోవాలని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -