Thursday, July 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యాధి నిరోధక టీకాలు తప్పక వేయించాలి: కలెక్టర్

వ్యాధి నిరోధక టీకాలు తప్పక వేయించాలి: కలెక్టర్

- Advertisement -

శ్రీరంగాపురం పీహెచ్సీలో పరిశీలన 
నవతెలంగాణ – వనపర్తి  
: చిన్న పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా, సకాలంలో వేయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. చిన్నారులకు టీకాలు వేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా, సకాలంలో వేయించాలని సూచించారు. టీకాల సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయాలని సూచించారు. వంద శాతం పిల్లలకు టీకాలు వేయాలని, వారి సమాచారం ఎప్పటి కప్పుడు అంతర్జాలంలో నమోదు చేయాలని సూచించారు. డైబెటిక్ కూడా పరీక్షలు చేసి మందులు ఇవ్వాలన్నారు. 

విద్యార్థులందరికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలి. పిల్లలకు పాఠశాల దశ నుంచే కంప్యూటర్ విద్య పై పట్టు సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన కృత్రిమ మేధస్సు (ఎ ఐ) శిక్షణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. బుధవారం శ్రీరంగాపురం మండలకేంద్రంలోని జడ్పహెచ్ ఎస్ బాలికల పాఠశాలను సందర్శించి కంప్యూటర్ ల్యాబ్ ను తనిఖీ చేశారు. 

కంప్యూటర్ శిక్షణ ఇస్తున్న అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్ సమస్య లేకుండా నాణ్యమైన ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలని, విద్యార్థులు కృత్రిమ మేధస్సు శిక్షణ తీసుకునేటప్పుడు హెడ్ సెట్ తప్పకుండా పెట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థికి ఇచ్చిన యూజర్ ఐ.డి ఎవరి ఐ.డి వారే వాడేవిధంగా చూడాలని సూచించారు.

పదోతరగతి విద్యార్థులు గణితంలో మంచి పట్టు సాధించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పలు గణిత ప్రశ్నలను సంధించి విద్యార్థుల ద్వారా సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సిబ్బంది కి సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, వైద్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -