- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
పశు వైద్యాధికారి శ్యాంసుందర్..నవ తెలంగాణ వెల్దండరైతులు తమ పశువులకు సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం అందించే వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని వెల్దండ పశు వైద్యాధికారి శ్యాంసుందర్ అన్నారు. వెల్దండ మండల పరిధిలోని బర్కత్ పల్లి , అంకమోనికుంట గ్రామలలో పశువులకు గాలికుంటు వ్యాధి రోగ నివారణ టీకాలు వేశారు . ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది నరేష్ రెడ్డి, నరసింహ, ఫణిందర్ రెడ్డి, శ్రీను, తిరుపతయ్య, గోపాలమిత్రలు మొగులయ్య, సాయిబాబా, బాలు ,విజేందర్, రైతులు వెంకటయ్య, ప్రకాష్, మధు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



