నవతెలంగాణ-హయత్ నగర్: 16 నుంచి 60 ఏళ్ల వరకు తప్పక టీకాలు తీసుకోవాలని, సరికొత్త ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ అవసరం అని కామినేని ఆస్పత్రి వైద్యులు సూచించారు. 24 నుంచి 31 వరకు అంతర్జాతీయ టీకాల వారోత్సవం సందర్భంగా సోమవారం ఎల్బీనగర్ లో ఉన్న కామినేని ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ విభాగపతి డాక్టర్ ఎం స్వామి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరికిషన్ లు మాట్లాడుతూ.. టీకాలు వేయించుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమేనని, పిల్లలకు చిన్నతనంలో వేయించినా, తర్వాత పెద్ద వయసులో కూడా కొన్ని రకాల టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రధానంగా కొవిడ్ తర్వాతి కాలంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వాటిలోనూ కొత్త కొత్త రకాలు వస్తున్నాయని, అందువల్ల వాటన్నింటి నుంచి దీర్ఘకాలంలో రక్షణ పొందాలంటే తప్పనిసరిగా కొన్ని రకాల టీకాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకృష్ణ రాఘవేంద్ర బొడ్డు, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద వయసులోనూ టీకాలు అవసరమే!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES