నవతెలంగాణ – బోనకల్ : మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మండల పశు వైద్య సిబ్బంది గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ తెల్లబోయిన నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ బస్సు వైద్య శిబిరంలో 66 పశువులకు గాలి కుంటి వ్యాధి నిరోధక టీకాలు వేశారు.పశుగణాభివృది సంస్థ ఆధ్వర్యంలో 21 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులందరూ తమ పశువులకు గాలి కుంటి వ్యాధి నివారణ కేకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ టీకాలవలన పశువులు ఆరోగ్యవంతంగా ఉంటాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండి సైదమ్మ, లైవ్ స్టాక్ అసిస్టెంట్ వెంకటనారాయణ, గరిడేపల్లి నాగేంద్రరావు, రవికృష్ణ, శ్రీకాంత్, పశుమిత్ర త్రివేణి, పశుగణాభివృది సంస్థ సూపర్వైజర్ మోత్కూరు వెంకయ్య, గోపాలమీత్ర అశోక్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లపాడులో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



