- Advertisement -
– పశువైద్యాధికారిణి డాక్టర్ దేవి రెడ్డి..
నవతెలంగాణ – మొయినాబాద్
పశువులకు తప్పని సరిగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పశు వైద్యాధికారి డాక్టర్ దేవి రెడ్డి అన్నారు. మండల పరిధిలోని బాకారం, నజీబ్ నగర్ గ్రామాల్లో ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పాడి రైతులు తప్పని సరిగా తమ పశువులకు టీకాలు వేయించుకుని పశువులను కాపాడుకోవాలని తెలిపారు. కావునా పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



