Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువుల గాలికుంటు నివారణకు వ్యాధి నిరోధక టీకాలు

పశువుల గాలికుంటు నివారణకు వ్యాధి నిరోధక టీకాలు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
గోజాతి పశువులలో గాలికుంటు వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుందని మండల పశుసంవర్ధక శాఖ అధికారి లక్కం ప్రభాకర్ బుధవారం తెలిపారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో  గేదె జాతి, గోజాతి పశువులకు ఉచితంగా వ్యాధి రాకుండా వ్యాధి నివారణ  టీకాలు ఇచ్చినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన పాల ఉత్పత్తికి , నాణ్యమైన మాంస ఉత్పత్తికి దోహదపడడానికి గాలికుంటు వ్యాధిని మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో , దేశంలో లేకుండా చేయడంలో భాగంగా ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం కొనసాగుతుంది. కావున పాడి యజమానులందరూ అపోహలు వీడాలి. పాలు తగ్గిపోతాయని లేదా చూలు పడిపోతుందని, గర్భం పోతుందనే అపోహలు వీడి పశువైద్యుల చేత, పశువైద్య సిబ్బంది చేత మీ ఇంటి దగ్గరే, కట్టు మీదనే మీ పశువులను ఉంచి ఉదయం పూట మీ  మీ పశువులకి మీరు దగ్గర ఉండి టీకాలు వేయించుకొని పశువులకి గాలికుంటు వ్యాధి సోకకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

గాలికుంటు వ్యాధి సోకిన పశువు నోట్లో పుండ్లయ్యి, కాలి గిట్టల మధ్యలో కూడా పుండ్లయ్యి నడవలేక ఏమీ తినలేక నీరసించి చివరకు చనిపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. వాస్తవానికి గాలికుంటు వ్యాధి సోకిన పశువులలో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది కానీ టీకా వేయడం వల్ల పాల ఉత్పత్తి తగ్గదు. ఇన్ని సంవత్సరాలుగా సంవత్సరానికి రెండుసార్లు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం కొనసాగుతూ ఉన్నప్పటికీ ఇంకా అక్కడక్కడ పాడి రైతుల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకా పట్ల అపోహలు  ఉన్నాయని అన్నారు.. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రాజేశ్వర్, శ్రీనివాస్ గౌడ్, అనిత, రాధ, దివ్య, నాగార్జున, శ్రీనివాస్, అశోక్ లు  పశువులకు టీకాలు  వేసినారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పిప్పెర శ్యాం, మల్లెల సాయారెడ్డి, పోచంపాడ్ శ్రీనివాస్, వేంపల్లి రాజన్న, పర్స శ్రీనివాస్ లు పాల్గొని, పశువైద్య సిబ్బందితో కలిసి వాడవాడలా తిరిగి, మామిడిపల్లి లో ఉన్న సుమారు 550 పాడి పశువులకు టీకాలు వేసినారు. రేపు కోటార్మూర్ లోని పాడి పశువులకు టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -