నవతెలంగాణ – సదాశివపేట
స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వడ్ల నికిత బింబాదర్ చారి సోమవారం ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ గా అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ తోపాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సర్పంచ్ ను, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను అభినందించారు. అనంతరం సర్పంచ్ నికిత బింబాదర్ చారి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల విస్తరణ, పేదలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఐక్యంగా కలిసి పనిచేస్తేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని వర్గాలవారిని సమానంగా చూసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ,నాయకులు,గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన వడ్ల నిఖిత బింబాదర్ చారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



