- Advertisement -
– రాకపోకలకు అంతరాయం
నవతెలంగాణ-ముధోల్ : ముధోల్ మండలంలోని బారీ వర్షం తో గురువారం వడ్తల్ వాగు లోలెవెల్ వంతెన పై నుండి ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుండి వర్షం కురవడంతో వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈవిషయం తెలుసుకున్న వడ్తల్,బోరిగాం పంచాయతీ కార్యదర్శలు సురేష్,పద్మజ తమ పంచాయతీ సిబ్బంది తో కలిసి పరీశీలించారు. ముధోల్ నుండి అబ్దుల్లాపూర్ వైపు వేళ్ళే వాహనాలకు అంతరాయం అంతరాయం ఏర్పడింది. ముధోల్ నుండి అబ్దుల్లాపూర్ వయా లోకేశ్వరం వైపు వేళ్ళే వాహనదారులు ఈవిషయం గమనించాలని స్థానికులు పేర్కొంటున్నారు. ఇటువైపు వెళ్లే వాహనదారులు ఇతర మార్గాలను ఎంచుకోవాలని కోరుతున్నారు.
- Advertisement -