నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ ద్వారా రూపొందిన ‘వైభవం’ చిత్రంతో రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ నెల 23న రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తున్నందుకు దర్శకుడు సాత్విక్ హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘ఆపదలో ఉన్నపుడు సహాయం చేసేవాళ్లు తక్కువ మంది ఉంటారురా! ఎవరైనా ఆపదలో ఉన్నారనిపిస్తే వాళ్లు నోరు తెరిచి అడిగేలోపు నువ్వే వాళ్లకి సహాయం చెరు’ అని ఒక తల్లి తన కొడుకుతో చెప్పడం ఈ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సెన్సార్ బోర్డు నుండి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రం ఈ వేసవిలో చక్కటి వినోదాన్ని ప్రేక్షకులకి పంచనుందని దర్శకుడు సాత్విక్ చెప్పారు.