- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని భిక్కనూర్, తిప్పాపూర్ గ్రామాలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పాపూర్ ఆలయ ఎండోమెంట్ చైర్మన్ భూమయ్య, సర్పంచ్ లింగారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు సిద్ధ రాములు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మయ్య, ఆలయ డైరెక్టర్లు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -


