నవతెలంగాణ -పెద్దవంగర
మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలను మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మండల అధ్యక్షుడు కట్టోజు భాస్కరాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వాజపేయి, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాలని కోరుకుంటూ.. అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. అణు పరీక్షలు చేయడం, కార్గిల్ విజయం కోసం పని చేశారని కొనియాడారు. వాజ్‌పేయి స్పూర్తితో ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ పని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మెరుగు సందీప్ కుమార్, మండల కార్యదర్శి శ్యామ్, బూత్ అధ్యక్షులు ముద్దరబోయిన శ్రీకాంత్, గణేష్, కిరణ్ కుమార్, బాలు, యశ్వంత్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వాజ్‌పేయి జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



