- Advertisement -
పార్టీ బలోపేతం కోసం సూచనలు సలహాలు
నవతెలంగాణ – బోడుప్పల్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన తోటకూర వజ్రెష్ యాదవ్ మంగళవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పార్టీ బలోపేతం స్థానిక కమిటీల నియామకం, వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏలా ఉండాలనే అంశాలపై సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్ ను కలసిన వారిలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు భూపతిగల్ల నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.
- Advertisement -



