Thursday, March 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేం నరేందర్ రెడ్డిని కలసిన వజ్రెష్ యాదవ్

వేం నరేందర్ రెడ్డిని కలసిన వజ్రెష్ యాదవ్

- Advertisement -

– రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల హర్షం
నవతెలంగాణ-బోడుప్పల్:
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల నుండి సీనియర్ నాయకుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేయాడం పట్ల మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం వేం నరేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలస శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో నరేందర్ రెడ్డి కీలక భూమిక పోషించారని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అందుకే అధిష్టానం ఆయన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిందని తెలిపారు.రాజ్యసభలో తెలంగాణ కు రావాల్సిన నిధుల పట్ల తన గళాన్ని వినిపించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. నరేందర్ రెడ్డిని కలిసిన వారిలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి భూపతిగల్ల తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -