Saturday, February 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రేమికుల రోజు కానుక..

ప్రేమికుల రోజు కానుక..

- Advertisement -

హీరో శ్రీ విష్ణు నటిస్తున్న నూతన చిత్రం ‘విష్ణు విన్యాసం’. నూతన దర్శకుడు యదునాథ్‌ మారుతి రావు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు జి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు. సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామచారి ఎం సహ నిర్మాతలు. ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌, ఫస్ట్‌ సింగిల్‌ ‘దేఖో విష్ణు విన్యాసం’కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మేకర్స్‌ సెకండ్‌ సింగిల్‌ ‘మొదలే మొదలే’ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. సంగీత దర్శకుడు రధన్‌ ఈ సాంగ్‌ని బ్యూటీఫుల్‌ లవ్‌ మెలోడీగా కంపోజ్‌ చేశారు.

రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం లవ్‌ ఫీలింగ్‌ని అందంగా ప్రజెంట్‌ చేసింది. మధుశ్రీ, నరేష్‌ అయ్యర్‌ వోకల్స్‌ మరింత మెలోడీని యాడ్‌ చేశాయి. ఈ సాంగ్‌లో శ్రీ విష్ణు, నయన సారిక కెమిస్ట్రీ లవ్లీగా ఆకట్టుకుంది. వాలెంటైన్స్‌ డేకి పర్ఫెక్ట్‌ గిఫ్ట్‌గా నిలిచే ఈ సాంగ్‌ ఇన్‌స్టంట్‌ హిట్‌గా అలరిస్తోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్‌, మురళి శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సత్యం రాజేష్‌, శ్రీనివాస్‌ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ :సాయి శ్రీరామ్‌, సంగీతం: రధన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ. రామాంజనేయులు, కొరియోగ్రఫీ: భాను మాస్టర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -